అమెరికాలో హైస్కూల్ పూర్తిచేసి...వైద్యవిద్య చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త
అమెరికాలో హైస్కూల్ విద్యను పూర్తి చేసి వైద్యులు కావాలని కలగనే వారికి కరేబీయన్‌లోని కురసావులో సెయింట్ మార్టినస్ వైద్య విశ్వవిద్యాలయం (SMU) మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. H1B వీసా కలిగిన తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చి హైస్కూల్ విద్యను పూర్తి చేసిన అనంతరం F1 వీసాతో కాలేజీలో చేరి MCAT వంటి అత్యధిక పోటీ కలిగిన పరీక్ష రాసి అమెరికాలో వైద్యవిద్య సీటు సంపాదించడం క్లిష్టమైన, కష్టమైన పని. దీనికి ప్రత్యామ్నాయంగా హైస్కూల్ పూర్తి అయిన వెంటనే MCAT పరీక్ష అవసరం లేకుండానే SMUలో అయిదేళ్ల వైద్యవిద్య(MD) కోర్సులో జేరి అది పూర్తయ్యాక USMLE ద్వారా అమెరికాలో రెసిడెన్సీ చేయడం వలన లక్షలాది డాలర్ల ఖర్చు తగ్గుదల, నాలుగు నుండి ఆరేళ్ల వరకు సమయం ఆదాతో పాటు, వీసా భయాలు ఉండవని విశ్వవిద్యాలయ కులపతి డా. గింజుపల్లి మురళి తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా అమెరికాలో సులభమైన, ప్రామాణికమైన మార్గాల్లో వైద్యవృత్తిలోకి ప్రవేశించే వెసులుబాటు ఉంటుందని అన్నారు.
AAEPO అక్రిడిటేషన్ కలిగి అంతర్జాతీయ ప్రమాణాలతో SMUలో తరగతులు నిర్వహిస్తున్నామని, వందలాది మంది మేథోవంతమైన వైద్యులు తమ పూర్వ విద్యార్థుల్లో ఉన్నారని మురళి పేర్కొన్నారు. తమ యూనివర్శిటీలో చదివే విద్యార్థులు ECFMG సర్టిఫికేషన్, అమెరికాలో రెసిడెన్సీల్లో సత్తా చాటారని గుర్తుచేశారు. అమెరికాలోని పలు ఆసుపత్రులతో తమ యూనివర్శిటీ ఒక క్లినికల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.
* ఇండియాలో ఉండే విద్యార్థులకు కూడా
ఇండియాలో ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదివిన విద్యార్థులు కూడా SMUలో వైద్యవిద్యను(MD) పూర్తి చేసి USMLE ద్వారా అమెరికాలో రెసిడెన్సీ చేసి వైద్యులుగా ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునని మురళీ అన్నారు. వీసా ప్రక్రియ, వసతికి యూనివర్శిటీ ద్వారా సహకరం అందిస్తామని తెలిపారు.
మరింత సమాచారం కొరకు - https://martinus.edu/admission-for-other-country-students/ చూడవచ్చు.
Tags-Medical School Opportunities For NRI Kids Of H1B Parents In USA and Canada By SMU Curacao,How HighSchool Kids In USA Can Become Doctors Without MCAT,kids of h1b parents into MD programs USMLE and US residency
Gallery

Latest Articles
- Nri Brs Malaysia Celebrates Kcr Birthday
- Ata Team Attends Indian Republic Day Celebration In Virginia
- Kcr Birthday In Bahrain By Nri Brs
- Telugu Assoc Of London Tal Conducts 14Th Annual Volleyball Tournament
- Siva Temple Tour Conducted By Tcss Singapore
- Kcrs 72Nd Birthday Celebrated In London And Kuwait
- Nrts Help Siva Devotees Via Upputuri Chinaramulu Trust
- Ncaia Dc 77Th Indian Republic Day Celebrations Today
- Annamayya District Woman Dies In Malaysia
- Palle Sambaralu In Chicago By Chicago Andhra Association
- Nats Phildalephia Celebrates Childrens Festival 2026
- 2026 Tantex Sankranti Celebrated In Telugu Spirit
- Siddhipeta Nri Uday Nagaraju Takes Oath In Uk House Of Lords From Bloomsbery
- Sreekanth Akkapalli Takes Charge As Fia President
- Charlotte Nats Conducts 2026 Chess Tournament
- 2026 Ata 19Th Conference Kick Off In Virginia
- Tana New York Conducts Cpr Training Session
- Telugu Samithi Of Nebraska Sankranti 2026
- Tantex 2026 Sankranti In Frisco
- Myta Malaysia Performs For Indian Pm Modi