సింగపూర్‌లో TCSS ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

Featured Image

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు ఈ యాత్ర నిర్వహించారు.

ఈ భక్తి యాత్రలో భాగంగా సింగపూర్‌లో ఉన్న 9-12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు. ఈ యాత్ర నిర్వహించడానికి సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్, బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్, టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుంచి బస్సులను సమకూర్చి నిర్వహించారు. ఈ దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా వివిధ బస్సుల ద్వారా సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించారు. అనంతరం భక్తులు TCSSకు తమ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గప్రసాద్, సంతోష్ కుమార్ జూలూరి, ప్రశాంత్ బసిక, సునీతరెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము వ్యవహరించారు. సొసైటీ అధ్యక్షుడు గడప రమేష్ బాబు, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి, నాగులపల్లి శ్రీనివాస్‌ తదితరులు సహకరించారు.

Tags-Siva Temple Tour Conducted By TCSS Singapore

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles