నాట్స్ బాలల సంబరాల్లో ప్రతిభ చాటిన ఫిలడెల్ఫియా బాలలు

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ప్రతి ఏటా బాలల సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభకు పట్టం కట్టింది. గణితం, తెలుగు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం ప్రతినిధులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. శ్రీధర్-సుధ అప్పసాని, హరినాథ్-రాధిక బుంగటావుల, వెంకట్-సుజనా శాఖమూరి, భువన్-కామేశ్వరీ పక్కేర్కర్‌లు ఆర్థిక సహకారం అందించారు. రమణ రాకోతు, సురేంద్ర కోరిటల, రవి ఇంద్రకంటి, వెంకట్ నాగరాజన్, రామ్ రేవల్, అభినవ్ మేడి, రామకృష్ణ గొర్రెపాటి, అప్పారావు మల్లిపూడి, రామ కొమ్మనబోయిన, చైతన్య పెద్దు, శ్వేత కొమ్మోజి, అక్షయ పుల్యాపుడి, రామ్ మోహన్ తాళ్లూరి, హరీష్ అన్నబత్తిన, సురేష్ బోందుగుల, విశ్వనాథ్ కోగంటి, న్యాయ నిర్ణేతలుగా అన్నపూర్ణ చాగంటి, శ్రీనివాస్ చాగంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, సెక్రటరీ(మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల తదితరులు పాల్గొని వేడుక విజయవంతానికి కృషి చేశారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందడిలు ఫిలడెల్ఫియా నాట్స్ బృందాన్ని అభినందించారు.

Tags-NATS Phildalephia Celebrates Childrens Festival 2026

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles