బహ్రెయిన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

Featured Image

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్ ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేశారు. అనంతరం ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను, 62ఏళ్ల కలను సాకారం చేయడమే కాకుండా తన ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కేసీఆర్ సొంతం చేసుకున్నారని కొనియాడారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చారన్నారు.

పదేండ్లలో కేసీఆర్ సాధించిన ప్రగతి కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సర్వే నివేదికతో స్పష్టమైందన్నారు. కాగ్ రిపోర్ట్, నీతి ఆయోగ్ తో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా తెలంగాణలో జరిగిన అభివృద్ధిని గుర్తించాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ బహ్రెయిన్ విభాగ ప్రధాన కార్యదర్శి అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్, మల్లెల ప్రమోద్, పుప్పలవాయి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags-KCR Birthday In Bahrain By NRI BRS

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles