యూకె...బ్లూమ్స్‌బరి లార్డ్‌గా సిద్ధిపేట ప్రవాసుడు ఉదయ్ నాగరాజు

Featured Image

బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లైఫ్ పీర్‌గా సిద్ధిపేటకు చెందిన ప్రవాసుడు ఉదయ్ నాగరాజును అధికారికంగా పరిచయం చేశారు. ప్రజాసేవ పట్ల నిబద్ధతను సూచిస్తూ ఆయన భగవద్గీతపై ప్రమాణం చేశారు. బ్లూమ్స్‌బరి లార్డ్‌గా ఆయన సేవలందించనున్నారు. యూకె ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ సలహా మేరకు రాజు చార్లెస్ ఈఈఈ జీవిత పీరేజ్‌ను ఆయనకు ప్రదానం చేశారు. ఇకపై ఆయన్ను అధికారికంగా బ్లూమ్స్‌బరీ లార్డ్ నాగరాజుగా పిలుస్తారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో చేరిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఉదయ్ నాగరాజు రికార్డు సృష్టించారు. బ్లూమ్స్‌బరీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. యూనివర్శిటీ కాలేజ్ లండన్ ఇక్కడే ఉంది. ఇందులో నాగరాజు ప్రొగెసర్‌గా తన సహకారాన్ని అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ ల్యాబ్స్‌ను స్థాపించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో ఉన్న శనిగరం నాగరాజు స్వగ్రామం.

Tags-Siddhipeta NRI Uday Nagaraju Takes Oath In UK House Of Lords From Bloomsbery

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles