మలేషియా భారాస ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

Featured Image

కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై భారాస సమన్వయకర్త మహేష్ బిగాల పిలుపు మేరకు మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు మారుతి కుర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మలేషియా వ్యవస్థాపకుడు చిట్టిబాబు చిరుత, కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ మలేషియా సభ్యులు రక్తదానం చేశారు.

అనంతరం లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోం అసోసియేషన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, శశి కుమార్, సందీప్ గౌడ్, సూర్య, కిరణ్మయి, జ్యోతి, మౌనిక, ఇతర సభ్యులు ముల్కల శ్రీనివాస్, శ్యామ్ రాజారామ్, సంతోష్ రెడ్డి, సాయి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags-NRI BRS Malaysia Celebrates KCR Birthday

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles