మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ అభ్యర్థిగా అశోక్ బడ్డి
మిచిగాన్ రాష్ట్రంలోని 56వ డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ రిప్రజెంటేటివ్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్థానిక భారతీయులు, కమ్యూనిటీ సభ్యులు మరియు మద్దతుదారులు పాల్గొన్నారు. అమెరికాలో వ్యాపార రంగంలో ఉన్న అశోక్, కమ్యూనిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ సెనేటర్ మైక్ వెబ్బర్, MI-GOP కోచైర్ సన్నీ రెడ్డి, OCRP ఛైర్మన్ పాట్రిక్ వాన్స్, స్టేట్ రిప్రజెంటేటివ్ టామ్ కున్, కౌన్సిల్ మెన్ మార్క్ గన్ పాల్గొన్నారు. ప్రవాస తెలుగువారు ప్రమోద్ గోపాల్, ఆనంద్ సిన్హా, వెంకట్ మంతెన, రఘు శంకర్మంచి, జాన్ రేనాల్డ్స్, శ్రీధర్ ఐత, శ్రీనివాస్ చిట్టలూరి, చెంచు రెడ్డి కూడా హాజరయ్యారు.
సమావేశంలో మాట్లాడిన అశోక్..ప్రజల అవసరాలు, 56వ డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం పనిచేయాలని తన లక్ష్యాన్ని వివరించారు. కుటుంబాలపై పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు అవసరమని ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారం వంటి అంశాల వల్ల కుటుంబాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించే విధానాలపై పని చేయాలని వివరించారు. విద్యా రంగంలో పాఠశాలల భద్రతను మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు సరైన మద్దతు కల్పించడం మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్‌లో రోడ్లు, రవాణా సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Tags-Ashok Baddi As Michigan 56th District State Rep Candidate
Gallery


Latest Articles
- Dr Haranath Policherla Appointed As Smu Governor Bod Chairman
- Nats 2026 Meet And Greet In Grapevine Kishore Kancharla Takes Charge As Chairman
- Nats Womens Day 2026 In Charlotte
- Taca Canada Telugu Ugadi 2026 In Toronto
- Komati Jayaram Takes Charge As Ap Special Representative In North America
- Tnilive Special Interview With The First And Only Female Linux Foundation Fellow Shuah Khan From Ongole Andhra Pradesh
- Tantex Women Health Yoga Session On March 7Th In Frisco
- Houston Telugu Cultural Association Golden Jubilee 2026
- Saudi Arabia Telugu News Telangana International Association Launched In Jeddah
- Nats Online Webinar On Immigration
- Nats St Louis Conducts Blood Donation Drive And Free Medical Camp
- Tana Sahitya Vedika Conducts International Mother Language Day 2026
- Hong Kong Telugu Samakhya Thkts Celebrates International Mother Language Day
- Tantex 223Rd Nntv Literary Meet Graced By Yellamraju Tyagaraju
- Carefully Curated Char Dham Yatra 2026 Focusing On Nris
- Medical School Opportunities For Nri Kids Of H1B Parents In Usa And Canada By Smu Curacao
- Nri Brs Malaysia Celebrates Kcr Birthday
- Ata Team Attends Indian Republic Day Celebration In Virginia
- Kcr Birthday In Bahrain By Nri Brs
- Telugu Assoc Of London Tal Conducts 14Th Annual Volleyball Tournament