శనివారం...ఫ్రిస్కోలో మహిళల ఆరోగ్యంపై టాంటెక్స్ సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక ఆధ్వర్యంలో యునైటెడ్ ఇన్ వెల్‌నెస్ – సెలబ్రేటింగ్ ఉమెన్ ఇన్ అవర్ కమ్యూనిటీ పేరిట మహిళల ఆరోగ్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈ శనివారం నాడు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు లోకిరెడ్డి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఆమె వెల్లడించారు.
మార్చి 7న శనివారం ఉదయం 830 నుండి 11గంటల వరకు 10YEC – యూత్ ఎక్సలెన్స్ సెంటర్, 7600 Cotton Wood St, Friscoలో నిర్వహిస్తున్నారు.
యోగా సెషన్, వైద్య నిపుణుల ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై చర్చ వంటివి ఏర్పాటు చేశారు. పాల్గొనేవారు తమ యోగా మ్యాట్స్ తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా దుస్తుల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. చీరలు, లెహంగాలు, ఆభరణాలు స్వీకరించబడతాయని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు వనితా వేదిక సమన్వయకర్త దీపికా పేటను టాంటెక్స్ వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు.
Tags-TANTEX Women Health Yoga Session On March 7th In Frisco, Frisco Telugu Events, Dallas Telugu Events, Dallas Telugu News
Gallery

Latest Articles
- Tnilive Special Interview With The First And Only Female Linux Foundation Fellow Shuah Khan From Ongole Andhra Pradesh
- Houston Telugu Cultural Association Golden Jubilee 2026
- Saudi Arabia Telugu News Telangana International Association Launched In Jeddah
- Nats Online Webinar On Immigration
- Nats St Louis Conducts Blood Donation Drive And Free Medical Camp
- Tana Sahitya Vedika Conducts International Mother Language Day 2026
- Hong Kong Telugu Samakhya Thkts Celebrates International Mother Language Day
- Tantex 223Rd Nntv Literary Meet Graced By Yellamraju Tyagaraju
- Carefully Curated Char Dham Yatra 2026 Focusing On Nris
- Medical School Opportunities For Nri Kids Of H1B Parents In Usa And Canada By Smu Curacao
- Nri Brs Malaysia Celebrates Kcr Birthday
- Ata Team Attends Indian Republic Day Celebration In Virginia
- Kcr Birthday In Bahrain By Nri Brs
- Telugu Assoc Of London Tal Conducts 14Th Annual Volleyball Tournament
- Siva Temple Tour Conducted By Tcss Singapore
- Kcrs 72Nd Birthday Celebrated In London And Kuwait
- Nrts Help Siva Devotees Via Upputuri Chinaramulu Trust
- Ncaia Dc 77Th Indian Republic Day Celebrations Today
- Annamayya District Woman Dies In Malaysia
- Palle Sambaralu In Chicago By Chicago Andhra Association