షార్లెట్‌లో...నాట్స్ మహిళా దినోత్సవ వేడుకలు

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) షార్లెట్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమెన్స్ నైట్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది ప్రవాస తెలుగు మహిళలు పాల్గొని సందడి చేశారు. మహిళా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పేలా సాగిన ఈ వేడుకలో బ్రెస్ట్ క్యాన్సర్ హబ్ ప్రతినిధి లోపాముద్ర, శక్తి ఫౌండేషన్ ప్రతినిధి నిదియా గాస్పర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మహిళా సాధికారత గురించి ప్రసంగించారు.

ఈ వేడుకలో మిస్ తెలుగు యూఎస్‌ఏ ఆర్గనైజేషన్ విజేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన బ్యూటీ పీజెంట్, బెస్ట్ డ్రెస్డ్ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. గాయని స్వాతి వారణాసి తన గానంతో అలరించారు. ఆటపాటలు, సంగీత విభావరితో వేడుక కోలాహలంగా సాగింది. షార్లెట్ నాట్స్ ప్రతినిధులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.

Tags-NATS Womens Day 2026 In Charlotte

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles