21న కెనడాలో తాకా ఉగాది ఉత్సవాలు

Featured Image

కెనడాలోని తెలుగు సంఘం TACA (Telugu Association of Canada) ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను 21న నిర్వహిస్తున్నారు. టొరంటోలోని నార్త్ యార్క్‌లో ఉన్న టొరంటో పావిలియన్‌లో వైభవంగా జరగనున్నాయి. కెనడాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అందరూ ఈ వేడుకలకు హాజరై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కలిసి ఆనందించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల కోసం ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, రంగురంగుల ఫోటో బూత్, వ్యాపార స్టాళ్లు, రుచికరమైన తెలుగు వంటకాలు, రాఫెల్ డ్రాలు వంటి అనేక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో పాల్గొనాలనుకునే పిల్లల తల్లిదండ్రులు info@teluguassociation.caకి ఇమెయిల్ ద్వారా ముందుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

Tags-TACA Canada Telugu Ugadi 2026 In Toronto

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles