ఇమ్మిగ్రేషన్‌పై నాట్స్ ఆన్‌లైన్ వెబినార్

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆస్క్ ఆన్ అటార్నీ పేరుతో ఆన్‌లైన్ వెబినార్ నిర్వహించింది. ఇమ్మిగ్రేషన్, వీసా సంబంధ సమస్యలపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు. కిరణ్ మందాడి సమన్వయపరిచారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, న్యూజెర్సీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి తోడ్పాటుతో ఈ వెబినార్ ఉపయుక్తంగా సాగింది.

ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ మార్పులపై ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను ఇలింద్ర వివరించారు. ఈ నెల విడుదలైన వీసా బులెటిన్‌ లోని మార్పులను విశ్లేషించడంతో పాటు, రాబోయే 2026 హెచ్-1బి ఫైలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన కొత్త నిబంధనలపై ప్రవాసులకు స్పష్టతనిచ్చారు. ఈబీ-5 గ్రీన్ కార్డ్ విధానం, స్టేటస్ మార్పు , వేతనాల వర్గీకరణ, అడ్వాన్స్ పెరోల్ ద్వారా ప్రయాణాలు, వీసా అపాయింట్‌మెంట్ స్లాట్ల లభ్యత, హెచ్-4 వీసా ఫైలింగ్ వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించారు. నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల నిర్వాహకులను అభినందించారు. శ్రీకాంత్ పొనకాల, రాకేష్ వేలూరు, శ్రీనివాస్ మెంటా తదితరులు సహకరించారు.

Tags-NATS Online Webinar On Immigration

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles