హ్యూస్టన్ TCA స్వర్ణోత్సవ వేడుకల రాయబారిగా ముత్యాల పద్మశ్రీ

Featured Image

హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి(TCA) 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల రాయబారిగా(అంబాసిడర్‌) ప్రవాసాంధ్ర ప్రముఖురాలు పద్మశ్రీ ముత్యాల వ్యవహరించనున్నారు. హ్యూస్టన్ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా నివసిస్తున్న ఆమె కుటుంబం స్థానిక తెలుగు సమాజంలో దశాబ్దాలుగా మమేకమయ్యారు. TCA 40వ వార్షికోత్సవ వేడుకల కన్వీనర్‌గా, తానా అధ్యక్షురాలిగా కూడా పద్మశ్రీ సేవలందించారు. ఆమె అనుభవాన్ని TCA స్వర్ణోత్సవ వేడుకల విజయవంతానికి వినియోగించుకోవాలని సంస్థ చేసిన ప్రతిపాదనకు ఆమె సుముఖత తెలిపారు.

స్వర్ణోత్సవ వేడుకల కన్వీనర్‌గా ఆటా మాజీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి వ్యవహరించారు. సంస్థ 50 ఏళ్ల ప్రయాణాన్ని ప్రతిబింబించేలా, తెలుగు వైభవానికి పట్టం కట్టేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని జితేందర్ రెడ్డి, పద్మశ్రీలు పేర్కొన్నారు.

Tags-Houston Telugu Cultural Association Golden Jubilee 2026

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles