🕑 Published: March 15, 2026 at 11:32 AM CST
వారంతపు సెలువు దినాల కారణంగా తిరుమల ( Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు( Compartments ) నిండి శిలాతోరణం వరకు క్యూలైన్‌లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని శనివారం 85,132 మంది భక్తులు దర్శించుకోగా 38,855 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీ ఆదాయం రూ. 3.62 కోట్లు వచ్చిందన్నారు.


