19వ ఆటా సభలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

Featured Image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా) ప్రతినిధులు కలిసి వచ్చే ఏడాది జులై 31 నుండి బాల్టిమోర్‌లో జరిగే 19వ ఆటా సభలకు ఆహ్వానించారు. మహాసభల లక్ష్యాలు, కార్యక్రమాల రూపురేఖలను ముఖ్యమంత్రికి వివరించారు. యువత భాగస్వామ్యం, వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయని తెలిపారు. సంస్థను సీఎం అభినందించారు.

అధ్యక్షుడు చల్లా జయంత్, తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు ఉన్నారు. అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతినిధులతో రణదీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి-కమల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Tags-TS CM Revanth Invited To 2026 19th ATA Convention In Baltimore MD

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles