హైవేను శుభ్రం చేసిన తానా వాలంటీర్లు

Featured Image

తానా మిడ్-అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు హారిస్‌బర్గ్‌లోని సిల్వర్ స్ప్రింగ్ టౌన్‌షిప్‌లో హైవేను స్థానిక పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులతో కూడిన వాలంటీర్లతో కలిసి శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సమాజం పట్ల బాధ్యతను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు.

తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ఫణి కంతేటి, ఇతర ప్రతినిధులు వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, సతీష్ చుండ్రు, రాజు గుండాల, వెంకట్ ముప్పా, శ్రీను కోట, శ్రీనివాస్ అబ్బూరి, నవీన్ తోకాల, వేణు మక్కెన, కిషోర్ కొంక, రాకేష్ పైడి తదితరులు పాల్గొన్నారు.

Tags-TANA Mid Atlantic Volunteers Adopt A Highway Cleanup

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles