ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIs

🕑 Published: March 27, 2026 at 12:57 PM CST

వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ఉగాది పురస్కారాలలో భాగంగా ఈ ఏడాది పలు విభాగాలలో సేవలు అందిస్తున్న ప్రవాసులకు "వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాలు" ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో అందజేశారు.

ప్రముఖ సినీనటుడు డా.రాజేంద్రప్రసాద్, నటీమణులు సంగీత, మంజుభార్గవి, దర్శకులు రేలంగి నరసింహారావు, సినీకవి వనమాలి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డా.కె.వి.రమణాచారి, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం హెడ్ కామేశ్వరి, డా. వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడికి "సభా భారతి" బిరుదు, అదే సంస్థ సభ్యులైన యడవల్లి శేషుకుమారికి శాస్త్రీయ సంగీతంలో, తంగిరాల సౌభాగ్యలక్ష్మికి లలిత సంగీతరంగంలో, పావని చిలువేరుకు సాహిత్య రంగంలో ఉగాది పురస్కారాలు అందజేశారు. వీరికి సింగపూర్ 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ అభినందనలు తెలిపారు. యూకే నుండి డా. బాబురావు చౌదరి చాపరాల-భారతి దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఖతార్ నుండి సాహిత్య జ్యోత్స్న కొలిపాక, యూఏఈ నుండి శ్రీకాంత్ చిత్తర్వు, శ్రీనివాస లింగం, సౌదీ అరేబియా నుండి కొనేరు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ కడించెర్ల, అమెరికా నుండి శ్రీనివాస్ గూడూరు, వాణి దిట్టకవి, జయరాం ఎర్రమిల్లి తదితరులు పురస్కారాలను అందుకున్నారు.

📲 Join Our WhatsApp Channel
ఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీటొరంటొలో వేడుకగా తాకా ఉగాదిరైతు నేస్తం ఫౌండేషన్-రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు ప్రదానంలండన్‌ తెలుగు సంఘం 21వ వార్షికోత్సవంఒమన్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణోత్సవంపరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘంసందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలుజపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరంన్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయపరాభవ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలుసింగపూర్‌లో పరాభవ నామ ఉగాది వేడుకలువైభవంగా జరిగిన TAGB ఉగాది సంబరాలుఏప్రిల్ 11న TAGDV ఉగాది వేడుకలుకువైత్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఇఫ్తార్డెలావేర్‌లో యువమేధకు పట్టం కట్టిన తానా చదరంగ పోటీలు - TANA Mid Atlantic Chess Tournament 2026టాంటెక్స్ వనితా వేదిక ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై సదస్సుపర్వాతోరహణపై ఐయోవాలో నాట్స్ సదస్సువిజయ్ చావాకు AMANA ప్రత్యేక పురస్కారం
Previous Article Next Article