🕑 Published: March 27, 2026 at 02:41 PM CST
తానా-పాఠశాల ఆధ్వర్యంలో "ప్రాగ్దిశ వీణియపై - మయూఖ తంత్రులమై" పేరిట వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం నాడు 100 మంది విద్యార్థులు 8గంటల పాటు నిర్విరామంగా పద్యం, పాట, కధ విభాగాలలో తమ ప్రతిభా పాటవాలు చాటారు.
అమెరికావ్యాప్తంగా ఉన్న వందలాది మంది ప్రవాస భారతీయ చిన్నారులకు తెలుగు నేర్పించే "పాఠశాల" నిర్వహించిన ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, కోశాధికారి రాజా కసుకుర్తిలు ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులను అభినందించారు. మన మాతృబాష తెలుగును రేపటి తరం కోసం ఆస్తిగా నిలుపుకుందామని పాఠశాల అధ్యక్షుడు మాగులూరి భాను పిలుపినిచ్చారు. ప్రసాద్ మంగిన, అమృత ముత్యాల, శ్రీరంజని శేట్టులూరి, రంజిత ఆదిమూలం, శేఖర్ చంద్రలు సహకరించారు.


