వాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవం

🕑 Published: March 30, 2026 at 09:42 AM CST

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వాషింగ్టన్ డీసీ ప్రాంత పార్టీ అభిమానులు, ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు. అన్నగారి ఆశయమైన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదానికి కట్టుబడి అహర్నిశలూ తెలుగుదేశం పార్టీ, పేద, బలహీన వర్గాల సంక్షేమానికి, యువత భవితకు, మహిళా సాధికారతకూ వేదికగా, కోట్లాది మంది తెలుగువారి ఆస్తిగా, ప్రపంచ దేశాలలో లక్షలాది మంది యువతకు సాంకేతిక రంగ భవితకు స్ఫూర్తినందించిన వేదికగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇటీవల రాష్ట్ర శాసనసభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ చేసిన తీర్మానం చరిత్రలో మైలురాయిగా, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటగా మిగిలిపోతుందని కార్యక్రమ సమన్వయకర్త భానుప్రకాష్ మాగులూరి అన్నారు. కార్యక్రమంలో యశస్వి బొద్దులూరి, సుధీర్ కొమ్మి, సాయి బొల్లినేని, రవి అడుసుమిల్లి, సాయిశ్రీనివాస రెడ్డి భూమిరెడ్డి, ఠాగూర్, వెంకటేశ్వర్రావు సామినేని, కిషోర్ కొడాలి, రామకృష్ణ ఇంటూరి, కృష్ణమోహన్ జంపాల, వినీల్ శ్రీరామినేని, మురళికృష్ణ కట్ల, హనుమంతరావు కూచి, రమేష్ రావిపూడి, సీతారామారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
లండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమంప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIsఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీటొరంటొలో వేడుకగా తాకా ఉగాదిరైతు నేస్తం ఫౌండేషన్-రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు ప్రదానంలండన్‌ తెలుగు సంఘం 21వ వార్షికోత్సవంఒమన్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణోత్సవంపరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘంసందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలుజపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరంన్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయపరాభవ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు
Previous Article Next Article