లండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవం

🕑 Published: March 30, 2026 at 09:38 AM CST

లండన్‌లోని నార్త్‌హోల్ట్ ప్రాంతంలో శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర(బాలాజీ) టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) ఆధ్వర్యంలో ఆదివారం ఎస్.కె.ఎల్.పి.సి(SKLPC) సెంటర్‌లో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాలను నిర్వహించారు. మంగళ్యధారణ, తలంబ్రాల వేడుకలు భక్తులను మైమరిపించాయి. భజనలు, పల్లకీ సేవలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేడుకకు విచ్చేసిన భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు తెలుగు సాంప్రదాయ భోజనప్రసాదం అందించారు. ఆలయంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అత్యాధునిక వంటశాల నిర్మాణానికి పలువురు దాతలు తమ వంతు విరాళాలను అందజేశారు.

కార్యక్రమ కన్వీనర్ మాట్లాడుతూ.. ఈ మహోత్సవం విజయవంతానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, లైఫ్ మెంబర్లు సహకరించారు.

📲 Join Our WhatsApp Channel
జపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమంప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIsఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీటొరంటొలో వేడుకగా తాకా ఉగాదిరైతు నేస్తం ఫౌండేషన్-రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు ప్రదానంలండన్‌ తెలుగు సంఘం 21వ వార్షికోత్సవంఒమన్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణోత్సవంపరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘంసందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలుజపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరంన్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయపరాభవ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలుసింగపూర్‌లో పరాభవ నామ ఉగాది వేడుకలు
Previous Article Next Article