బే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

🕑 Published: March 30, 2026 at 09:47 AM CST

తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమఒ అనే పునాదులపై తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుందని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు.
బే ఏరియా మిల్పిటాస్ పట్టణంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. తెదేపా ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అనేక మార్పులు తీసుకొని వచ్చింది అన్నారు. సమాజంలోని రాజకీయ అసమానతలను తొలగించి బడుగు, బలహీన వర్గాల వారికీ రాజ్యాధికారం దక్కేలా చేసింది అన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ...తెలుగుదేశం పార్టీ 24 ఏళ్ళు అధికారంలో, 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది. ఈ 44 ఏళ్ల ప్రయాణంలో ప్రజల పక్షానే నిలిచి అనేక ఉద్యమాలు చేసింది అని పేర్కొన్నారు. వెంకట్ కోగంటి మాట్లాడుతూ... చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం వల్లే తాము అమెరికాలో ఈ స్థాయిలో ఉన్నామన్నారు.

ఈ కార్యక్రమాన్ని రాజశేఖర్ పర్వతనేని సమన్వయపరిచారు. విజయ్ గుమ్మడి, శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీనివాసు తడపనేని, విజయ్ జెట్టి, వెంకట్ అడుసుమల్లి, సుబ్బా యంత్ర, రమేష్ మల్లారపు, రవి అడుసుమల్లి, హరి సన్నిధి, భాస్కర్ మొలకలపల్లి, రవి కిరణ్, ఎంవీరావు, భరత్ ముప్పీరాల, గాంధీ పాపినేని, శివ గుమ్మడి, జగదీష్ గింజుపల్లి, రామ్ తోట, శ్రీనివాస్ వల్లూరుపల్లి, సురేష్ పోతినేని. భాస్కర్ అన్నే, వాసు బండ్ల, రాజా కొల్లి, సీతారాం కోడలి, చంద్ర గుంటుపల్లి, శ్రీనివాసు పతకమూరి తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
వాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమంప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIsఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీటొరంటొలో వేడుకగా తాకా ఉగాదిరైతు నేస్తం ఫౌండేషన్-రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు ప్రదానంలండన్‌ తెలుగు సంఘం 21వ వార్షికోత్సవంఒమన్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణోత్సవంపరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘంసందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలుజపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరంన్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయ
No Previous Next Article