🕑 Published: September 09, 2026 at 07:00 PM CST
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) చికాగో విభాగం ఆధ్వర్యంలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 150 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్‌లో 'టీమ్ బ్రదర్స్' విజేతగా నిలవగా, 'ఫాసక్ వారియర్స్' రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడంలో మాజీ ఈసీ సభ్యులు హరీష్ జమ్ముల, ఈసీ సభ్యులు వీర తక్కెళ్లపాటి, చాప్టర్ సభ్యులు నరేంద్ర కడియాల, అంజయ్య వెలూరు, సతీష్ త్రిపురనేని, వరుణ్ కుమార్ గడ్డం, నాగరాజ్ మేడ, భానుచందర్ కీర్తి, గోపీకృష్ణ ఉలవ, మనోహర్ పాములపాటి, పాండు చెంగల్శెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, షారుఖ్ సయ్యద్, వినోత్ బాలగురు తదితరులు కృషి చేశారు.
నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీనివాస్ బొప్పన, శ్రీరామ్ కొప్పాక, శేషు మారంరెడ్డి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, మాజీ ఈసీ సభ్యుడు ఆర్.కె. బాలినిని, మాజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, హ్యూస్టన్ నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేష్ చిలుకూరి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన చికాగో బృందాన్ని, విజేతలను అభినందించారు.


