బే-ఏరియాలో వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవం

🕑 Published: September 22, 2026 at 09:16 AM CST

కాలిఫోర్నియాకు చెందిన వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవ వేడుక బే-ఏరియా నెవార్క్‌లో రచయిత్రి షంషాద్-అబ్దుల్లాల గృహంలో ఏర్పాటు చేశారు. కౌముది పత్రిక కిరణ్ ప్రభ, నెచ్చెలి పత్రిక సంపాదకురాలు డా. కె. గీతామాధవి సభాధ్యక్షులుగా పాల్గొన్నారు. వెంకట్ నాగం రచించిన “రచ్చబండ చర్చలు”, “కలగూర గంప” పుస్తకాలను ఈ వేడుకలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ ప్రభ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రజలతో మమేకమయ్యే భాషలో ఆలోచనాత్మక కాలం శీర్షికలో పత్రికలలో రచనలు చేయడం ముఖ్యమని వివరించారు. వెంకట్ నాగం రచనలు సమాజంలోని విభిన్న అంశాలను స్పృశించాయి అని ప్రశంసించారు. వెంకట్ వ్యాస రచనా ప్రయాణం మరింత ఉజ్వలంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. వీక్షణం వ్యవస్థాపకురాలు, సంధానకర్త, నెచ్చెలి పత్రిక ప్రధాన సంపాదకురాలు డా. కె. గీతామాధవి రచయిత సామాజిక దృక్పథాన్ని, సాహిత్య నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమంలో రమణ, శారద కాశీవఝల, డా. సురేందర్ రెడ్డి, వాణి తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
సెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంన్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీఫ్రిస్కోలో టాంటెక్స్ ఉచిత వైద్య శిబిరంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్ కళాకారుల ప్రదర్శనఉల్లాసంగా సాగిన తానా వేసవి చదరంగ పోటీఅమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సుఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలుSingapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making EventAustralia: సిడ్నీలో "నిజం గెలిచింది"మెలిస్సాలో "సంకీర్తన" తరగతులువీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీనెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్
Previous Article Next Article