🕑 Published: September 20, 2026 at 04:24 PM CST
జపాన్ తెలుగు సంఘం (TAJ-Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని, భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడికి ప్రత్యేక పూజలు, భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.


