ఒమాన్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

🕑 Published: April 05, 2026 at 12:03 PM CST

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి తరహాలో ఒమాన్‌లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ శుక్రవారం వేయి కిలోమీటర్ల దూరంలోని సలాల, సోహార్, ఇబ్రి ఎడారి ప్రాంతాల నుండి కూడా వందల సంఖ్యలో భక్తులు మస్కట్‌కు తరలి వచ్చి శ్రీ కృష్ణ మందిర ఆవరణలో జరిగిన ఈ కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. స్థానిక ప్రవాసీ, ప్రముఖ వేద పండితులు విజయకుమార్ ఆధ్వర్యంలో పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నులపండువగా కార్యక్రమం కొనసాగింది. భారత రాయబారి జీవీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. యుద్ధ పరిస్థితుల్లో అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ ఒమానీ ప్రభుత్వం తమకు కల్యాణం నిర్వహించుకోవడానికి అనుమతించినందుకు కల్యాణోత్సవ ముఖ్య నిర్వాహకులలో ఒకరైన చందక రాందాస్ కృతజ్ఞతలు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
సౌదీలో అమరావతి విజయోత్సవంఫుడ్‌బ్యాంకులో నాట్స్ మిస్సోరి సభ్యుల సేవమలేషియాలో ఉగాది గీతాంజలిమెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమంఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026ATA Celebrates Womens Day 2026 In Washington DCఆర్టెమిస్-2 ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తున్న డా. సుబ్బారావు - TNI ప్రత్యేకంతుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబుతెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సుబే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమం
Previous Article Next Article