అమరావతి అజరామరం...బే-ఏరియాలో వేడుక

🕑 Published: April 05, 2026 at 12:07 PM CST

ఏపీ రాజధాని అమరావతి అజరామరం అని గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు వ్యాఖ్యానించారు. చట్టబద్ధమైన రాజధానిగా అమరావతి ఏర్పడిన నేపథ్యంలో బే ఏరియా మిల్పిటాస్ పట్టణంలో ఏప్రిల్ 3వ తేదీన ఎన్నారైలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధి కోమటిజయరాం పిలుపు మేరకు అమరావతి రాజధాని చట్టబద్ధతపై అమెరికా వ్యాప్తంగా ఎన్నారైలు పండుగ వాతావరణంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదని, 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు అని తెలిపారు. అమరావతి ఉద్యమానికి సరికొత్త నిర్వచనం చెప్పి అమరావతి రైతులు చరిత్ర సృష్టించారని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చడం సాధ్యంకాదనే విషయాన్ని పార్లమెంట్‌లో చేసిన తాజా చట్టం స్పష్టం చేసిందని తెలిపారు.
వెంకట్ కోగంటి మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని ప్రజావిజయంగా అభివర్ణించారు. రైతుల పోరాటాలకు, త్యాగాలకు ఇది ప్రతిరూపంగా నిలిచిందని అన్నారు. అమరావతే రాజధాని అని దేశవ్యాప్తంగా ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేశారని అన్నారు. ఒక్క వైసీపీ పార్టీ మాత్రం వ్యతిరేకించడం దురదృష్టకరమని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. అమరావతిపై విద్వేషాన్ని, విషాన్ని కక్కుతున్నారని అన్నారు. బే ఏరియాలో అమరావతి ఉద్యమానికి మద్దతుగా అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఏర్పడం ద్వారా తెలుగు ప్రజల కలలు సాకారమయ్యాయని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయ్ గుమ్మడి సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీని వల్లూరిపల్లి, బిర్యానీ జంక్షన్ వెంకట్, మోహన్ మల్లెంపాటి, జగదీష్ గింజుపల్లి, భాస్కర్ అన్నే, విజయ్ రెడ్డి జెట్టి, శ్రీనివాస్ వట్టికూటి, సతీష్ అంబటి, తిరుపతిరావు వలివేటి, రవి కిరణ్ యేలేటి, నరేందర్ రెడ్డి యెన్నంరెడ్డి, రాంబాబు మానుకొండ, కిశోర్ తాడికొండ, హరి సన్నిధి, యశస్వి మాధవ, చంద్రశేఖర్, అనంతరాం, వంశీ కందుల, మహేంద్ర కూచిపూడి, మురళి సురం తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
ఒమాన్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణంసౌదీలో అమరావతి విజయోత్సవంఫుడ్‌బ్యాంకులో నాట్స్ మిస్సోరి సభ్యుల సేవమలేషియాలో ఉగాది గీతాంజలిమెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమంఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026ATA Celebrates Womens Day 2026 In Washington DCఆర్టెమిస్-2 ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తున్న డా. సుబ్బారావు - TNI ప్రత్యేకంతుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబుతెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సుబే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ
No Previous Next Article