డల్లాస్‌లో వైభవంగా టాంటెక్స్ ఉగాది మహోత్సవం

🕑 Published: April 13, 2026 at 12:56 PM CST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గత ఆదివారం నాడు అలెన్‌లోని రాధాకృష్ణ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

సంప్రదాయ పూజలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, పానకం వంటివి ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమల సమన్వయకర్త అనిత వేమిరెడ్డి స్వాగతోపన్యాసంతో వేడుకలు ప్రారంబమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తెలుగు పద్య పోటీలు నిర్వహించారు. టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ భవిష్యత్ కార్యక్రమాలపై ప్రసంగించారు. ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. లైవ్ బ్యాండ్ "రీవైవల్" సంగీత ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అనిరుధ్ సుస్వరం, మనోజ్ఞ బెల్లంకొండలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. యాంకర్లుగా మధురిమ, రాధా వ్యవహరించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వేడుకల సమన్వయకర్త అర్పిత రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగించారు.

📲 Join Our WhatsApp Channel
తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుకు కీలక బాధ్యతలున్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ బరిలో సరితాUNMCతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒప్పందంఆటా సాంస్కృతిక పోటీల నమోదుకు చివరి తేదీ ఇదేపుస్తకాలతోనే సంస్కారవంతమైన సామాజికాభ్యుదయం సాధ్యంవాషింగ్టన్ డీసీలో అమరావతి చట్టబద్దతపై ఆనందోత్సాహాలుఅమరావతి అజరామరం...బే-ఏరియాలో వేడుకఆస్ట్రేలియాలో అమరావతి సంబరంఒమాన్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణంసౌదీలో అమరావతి విజయోత్సవంఫుడ్‌బ్యాంకులో నాట్స్ మిస్సోరి సభ్యుల సేవమలేషియాలో ఉగాది గీతాంజలిమెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమంఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026ATA Celebrates Womens Day 2026 In Washington DCఆర్టెమిస్-2 ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తున్న డా. సుబ్బారావు - TNI ప్రత్యేకంతుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబుతెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సు
Previous Article Next Article