🕑 Published: April 14, 2026 at 10:49 AM CST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో చిన్నారుల కోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఆదివారం నాడు కాలేజ్‌విల్లేలోని ఎవాన్స్‌బర్గ్ స్టేట్ పార్క్‌లో నిర్వహించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగులు సమన్వయపరిచారు. రంగురంగుల గుడ్లు, ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స్ ' కోసం పిల్లలు ఉత్సాహంగా వెతికారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి కీలకపాత్ర పోషించారు. పెద్దలకు, పిల్లలకు పలు ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. మిడ్-అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ సహకారం అందించారు. సురేష్ యలమంచి, విశ్వనాథ్ కోగంటి తదితరులు పాల్గొని సహకరించారు.






