🕑 Published: April 24, 2026 at 06:09 PM CST
న్యూయార్క్‌లో పంచెకట్టు ఫ్యాషన్ షో అలరించింది. స్థానిక తెలుగు సంఘం TLCA ఉగాది వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 60మంది పాల్గొన్నారు. కనుమరుగవుతున్న తెలుగు పంచెకట్టును ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చేనేత పంచెలతో ఏర్పాటు చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. నెహ్రూ కఠారు, కిరణ్ రెడ్డి పర్వతాల, ప్రసాద్ డబ్బీరు, హరిశంకర్ రసపుత్ర, కార్తీక్ మన్నెం, సుమంత్ రాంశెట్టి తదితరులు సమన్వయపరిచారు. శిరీష తూనుగుంట్ల సహకరించారు. ఉగాది వేడుకల్లో డా. నోరి దత్తాత్రేయుడు, సినీ గీత రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.




