చదరంగం చిచ్చరపిడుగు..సరయు తలపనేని - TNI ప్రత్యేకం

🕑 Published: August 23, 2026 at 08:31 PM CST

* కొలంబియాలో అద్భుత ప్రదర్శన
* 8ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ చెస్ టైటిల్‌కు అర్హత

టెక్సాస్ రాష్ట్రం అర్వింగ్‌కు చెందిన 8ఏళ్ల తెలుగు బాలిక సరయు తలపనేని అంతర్జాతీయ చెస్ వేదికపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబియాలోని మెడెలిన్‌లో ఆగష్టు నెల ప్రారంభంలో జరిగిన 36వ పాన్-అమెరికన్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ బాలికల అండర్-8 క్లాసికల్ విభాగంలో అమెరికా తరఫున బరిలోకి దిగిన సరయు బంగారు పతకంతో పాన్-అమెరికన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు చెందిన యువ చెస్ క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలో సరయు తొమ్మిదికి తొమ్మిది రౌండ్లలో విజయం సాధించి 9/9 అనే అరుదైన పర్ఫెక్ట్ స్కోర్ నమోదు చేసింది.

* తొమ్మిది రౌండ్లు..తొమ్మిది విజయాలు!
పాన్-అమెరికన్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ సాధారణ బాలల చెస్ పోటీ కాదు. పాన్-అమెరికాలోని వివిధ దేశాల అత్యుత్తమ యువ క్రీడాకారులు పాల్గొనే ప్రతిష్ఠాత్మక పోటీ. సరయు పాల్గొన్న అండర్-8 బాలికల క్లాసికల్ విభాగంలో 37 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. తొమ్మిది రౌండ్ల స్విస్ విధానంలో జరిగిన ఈ పోటీలు 90 నిమిషాలు + ప్రతి ఎత్తుకు 30 సెకన్ల అదనపు సమయం వంటి క్లాసికల్ టైమ్ కంట్రోల్‌తో నిర్వహించారు. అంటే వేగంగా ఎత్తులు వేయడం మాత్రమే కాకుండా, గంటల తరబడి ఏకాగ్రత, వ్యూహం, లెక్కింపు, సమయ నిర్వహణతో పోరాడాల్సి ఉంటుంది. అలాంటి తొమ్మిది రౌండ్లలోనూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేదా డ్రా లేకుండా సరయు మొత్తం 9 పాయింట్లు సాధించడం ఆమె విజయానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ టోర్నీలో పెరూ, మెక్సికో, జమైకా, వెనిజులా, బ్రెజిల్ తదితర దేశాలకు చెందిన క్రీడాకారిణులతో సరయు తలపడి ఈ అరుదైన రికార్డు సాధించింది. ఈ విజయం సరయుకు మరో అరుదైన గౌరవాన్ని అందించింది. పాన్-అమెరికన్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-8 బాలికల విభాగంలో సాధించిన ఈ విజయంతో వుమెన్ కాండిడేట్ మాస్టర్ అనే అధికారిక ఫీడే టైటిల్‌కు అర్హత సాధించింది. 8ఏళ్ల వయసులోనే ఈ స్థాయి అంతర్జాతీయ టైటిల్‌కు చేరువ కావడం ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.

* అయిదేళ్ల నుండి ఎత్తుకు పైఎత్తులు
ఐదేళ్ల వయసులో కొప్పెల్ చెస్ క్లబ్‌లో చేరిన సరయు కూచిపూడి, పియానో, ఆర్ట్, జిమ్నాస్టిక్స్ వంటి అనేక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ తన దినచర్యను సమన్వయపరుచుకునేదని కుటుంబసభ్యులు తెలిపారు. స్థానిక టోర్నమెంట్‌లో ఆమె ఆటను గమనించిన అనిల్ గుట్ల సరయులో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ అవసరమని కుటుంబానికి సూచించగా ఇంటర్నేషనల్ మాస్టర్ సక్షమ్ రౌటెలా శిక్షణలో మెళుకువలు నేర్చుకుంది. గత కొన్నేళ్లుగా టెక్సాస్‌వ్యాప్తంగా పలు టోర్నీల్లో పాల్గొంటూ తన అనుభవాన్ని పెంచుకుంది. పాఠశాల అనంతరం గంటల తరబడి శిక్షణ, వారాంతాల్లో టోర్నమెంట్లు ఆమె విజయానికి తోడ్పడ్డాయి. 2025 డిసెంబర్ నాటికి అమెరికాలో 7ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికల టాప్-100 జాబితాలో సరయు నంబర్-1గా నిలిచింది. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఫీడే రేటింగ్ ఆధారంగా అండర్-8 వయసు బాలికల్లో ప్రపంచ నంబర్-1గా కూడా నిలిచింది. పిన్నవయస్సులో చదరంగ పోటీలో విజయం సాధించిన సరయుకు నాలుగుసార్లు అమెరికా మహిళల జాతీయ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన కారిస్సా యిప్ ప్రత్యేక అభిననందలు తెలిపింది. తమ కుమార్తెను చదరంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఆమె తల్లిదండ్రులు మొవ్వా శ్రీలక్ష్మి, తలపనేని సందీప్‌లు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
కొలరాడోలో నాట్స్ చెస్ పోటీJanaSena Bahrain Celebrates Chiranjeevi's 71st Birthday with Blood Donation Driveభవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి-న్యూజెర్సీలో మన్నవసెయింట్ లూయిస్‌ ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సేవలుఉత్సాహంగా ముగిసిన 2026 తాల్ ప్రీమియర్ లీగ్అట్లాంటిక్ మహాసముద్రంపై భాగవత సప్తాహంహైదరాబాద్‌లో శనివారం నాడు సిరికోన సాహితీ అకాడమీ వార్షికోత్సవంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవంమెల్‌బోర్న్ భారత కాన్సుల్ జనరల్‌తో APNRT ప్రతినిధుల భేటీతానా ఆధ్వర్యంలో యూత్ కోడ్-ఎ-థాన్దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాభాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ - హర్షం తెలిపిన సింగపూర్ ప్రవాసులువైభవంగా హ్యూస్టన్‌ TCA స్వర్ణోత్సవాలుఅద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి పొందిన వేటూరి సాహిత్యం - జొన్నవిత్తుల₹15లక్షలు విరాళం సేకరించిన కొల్లా సాకేత్ ఫౌండేషన్కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి - TNI ప్రత్యేకం15వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శోభారెడ్డి-ప్రసాద్‌రెడ్డిబర్డ్ ఆసుపత్రి డైరక్టర్ డా. గుడారు జగదీశ్‌కు టీటీడీ సన్మానంఫిలడెల్ఫియాలో రాజేంద్రప్రసాద్‌కు సన్మానంగుండ్లకమ్మ నదీమ తల్లి ఒడ్డున యాత్రకు శ్రీకారం
No Previous Next Article