ఫిలడెల్ఫియా తానా ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇంటర్న్‌షిప్

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫిలడెల్ఫియా విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా మాస్టర్ మైండ్ ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిజిటల్ మీడియా, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాజెక్ట్ ప్లానింగ్ వంటి అంశాల్లో ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తారు. నాలుగు వారాల ఈ ఆన్‌లైన్ తరగతులు ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6-7 గంటల మధ్య నిర్వహిస్తామని తుమ్మల సతీష్, కంతేటి ఫణిలు తెలిపారు.

వివిధ ఆన్‌లైన్ వేదికలను సద్వినియోగం చేసుకోవడం, వీడియోలు, గ్రాఫిక్స్ రూపకల్పన, మార్కెటింగ్ మెళకువలు, బ్రాండింగ్, ప్లానింగ్ వంటి విషయాలను వివరిస్తారు. మరిన్ని వివరాలు +1-610-620-4135 ద్వారా తెలుసుకోవచ్చు. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, వెంకట్ సింగు, వెంకట్ అడుసుమిల్లి, Gifted Gabber CEO జ్యోత్స్న కేథర్, రించ్ తదితరులు సహకరించారు.

Tags-Philadelphia TANA Conducts Social Media Internship

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles