చికాగో తెదేపా శ్రేణులతో ఎన్ఎండీ ఫిరోజ్ సమావేశం

Featured Image

తెదేపా సీనియర్ నేత, మంత్రి ఎన్.ఎం.డీ ఫరూక్ తనయుడు TDP జనరల్ సెక్రటరీ ఎన్ఎండీ ఫిరోజ్ ఆదివారం నాడు చికాగోలో స్థానిక ఎన్నారై తెదేపా శ్రేణులతో సమావేశమయ్యారు. కానూరు ఫాం హౌజ్‌లో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఫాహాద్ సమన్వయపరిచారు. ఫిరోజ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రవాసులు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. తెదేపాలో యువతరానికి పెద్దపీట వేస్తున్నారని, పార్టీ కోసమే గాక రాష్ట్రం కోసం యువతరాన్ని పార్టీకి మరింత చేరువ చేయవల్సిన అవసరం ఉందని ఫిరోజ్ అన్నారు.

Tags-TeluguDesam General Secretary NMD Firoz Meets Chicago NRI TDP

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles