సిలికానాంధ్ర అధ్యక్షురాలిగా తనుగుల సత్యప్రియ

Featured Image

సిలికానాంధ్ర 2025–2027 కమిటీని ప్రకటించారు. ఈసారి తొలిసారిగా మొత్తం మహిళలతో కూడిన నాయకత్వ బృందం ఏర్పడటం పట్ల ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు హర్షం తెలిపారు. అధ్యక్షురాలిగా సత్యప్రియా తనుగుల, ఉపాధ్యక్షురాలిగా శిరీష కలేరు, కోశాధికారిగా మాధవి కడియాల, కార్యదర్శిగా రామ సరిపల్లె, సంయుక్త కార్యదర్శిగా ఉష మాడభూషిలు బాధ్యతలు స్వీకరించారు. వీరందరూ అనేక సంవత్సరాలుగా సంస్థకు సేవలందిస్తూ సాంస్కృతిక మహోత్సవాలు, అంతర్జాతీయ కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, గ్లోబల్ అవుట్‌రీచ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. వారి కృషి, దృష్టి, నాయకత్వం సమాజంపై సిలికాంధ్ర ప్రభావాన్ని వ్యాప్తిచేయగా, ఇప్పుడు సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కుచిభొట్ల ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గానికి కూచిభొట్ల శాంతి, రాజు చమర్తి, దిలీప్ కొండిపర్తి తదితరులు అభినందనలు తెలిపారు.

Tags-Satyapriya Tanugula Is SiliconAndhra President 2025-27

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles