కాలేజీ ప్రవేశాలపై నాట్స్ వెబినార్

Featured Image

నాట్స్ ఆధ్వర్యంలో అమెరికాలో కాలేజీల్లో ప్రవేశాలు, SAT-ACT పరీక్షలపై ప్రవాస విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు వెబినార్ నిర్వహించారు. సుకేశ్ సబ్బాని సమన్వయకర్తగా వ్యవహరించారు. విద్యావేత్త, యూనివర్సిటీ ఆఫ్ చికాగో పూర్వ విద్యార్థిని, డెలాయిట్ సైబర్ రిస్క్ కన్సల్టెంట్‌గా పనిచేసిన రీమా చితాలియా ఈ వెబినార్‌లో డిజిటల్ శాట్ పరీక్షలోని రెండు-మాడ్యూల్ వ్యవస్థ, ఐటెమ్ రెస్పాన్స్ థియరీ(ఐఆర్‌టి) స్కోరింగ్ విధానం, ఇంగ్లీష్, గణిత విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే వ్యూహాలను వివరించారు.

విద్యా సంవత్సరంలో ఏ సమయంలో పరీక్షలు రాస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయో డేటా ఆధారిత వివరాలను రీమా వెల్లడిణ్చారు. పదో తరగతి నుండి పరీక్షలకు సిద్ధం కావడంతో మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి పాల్గొన్నారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కిరణ్ మందాడి ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నిర్వాహకులను అభినందించారు.

Tags-NATS Webinar On SAT ACT College Admissions

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles