ఖతార్‌లో తెలుగు భాషా దినోత్సవం

Featured Image

ఖతార్‌లో తెలుగు భాషా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్, ష్తానిక తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదికలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్‌ఆర్, అడ్మిన్ & కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు పాల్గొన్నారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వివిధ కూరగాయలు-పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలతో తెలుగు భాష సృజనాత్మకతను ప్రదర్శించారు. తెలుగు భాషపై నిర్వహించిన క్విజ్ అలరించింది. గిడుగు వెంకట రామమూర్తి కవిత్వాన్ని, వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని ఆ గ్రామానికి చెందిన అతిథి వివరించారు.

ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్, ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల, సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి (TJQ-ఉపాధ్యక్షురాలు), హరీష్ రెడ్డి(TKS-అధ్యక్షుడు), శ్రీనివాస్ గద్దె (TPS-అధ్యక్షుడు), విక్రమ్ సుఖవాసి, తదితరులు పాల్గొన్నారు.

Tags-Telugu Language Day In Qatar By ICC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles