సౌదీలో సాటా తెలుగు భాషా దినోత్సవం

Featured Image

సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయులు రియాద్‌లో తెలుగు భాష దినోత్సవం మరియు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సాటా ఫౌండర్ మల్లేష్, సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ మాసూద్, రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భాష ఒక జాతి ప్రాణమని, గురువులు జీవనానికి మార్గదర్శకులని వక్తలు పేర్కొన్నారు. గురజాడ, శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వాక్యాలను ఉదహరిస్తూ, భాషా ప్రాధాన్యం, గురుపూజ ఆవశ్యకతను మల్లేష్, శ్రీనివాస్ మచ్చ విశదీకరించారు.

కార్యక్రమంలో యోగేష్ వీరవల్లి, కాశీరాజు, అంజాద్, తేజ, స్వామి తదితరులు పాల్గొన్నారు. రియాద్‌లో పదేళ్లకు పైగా విద్యాసేవలు అందించిన ఉపాధ్యాయులకు గౌరవ సత్కారం, మెమొంటోలు బహుకరించారు. శర్వాణి విద్యాధరణి, కోకిలలోకేష్, ప్రీతి, మహమ్మద్ నూరుద్దీన్, సింగ్ నరేష్, శహబాజ్ అహ్మద్, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిథున్ సురేష్, ముదిగొండ శంకర్, వీరవల్లి యోగేశ్వరా రావు, మురళి క్రిష్ణ బూసి, నయీమ్, అయాజ్, ముజామిలుద్దీన్, ఇలియాస్, అస్లాం తదితరులు కూడా పాల్గొన్నారు.

Tags-SATA Saudi Telugu Language Day 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles