భవిష్యత్ వైద్యుడికి పొట్లూరి రవి ఆర్థిక చేయూత

Featured Image

తానా బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళకు చెందిన బైపీసీ విద్యార్థి కె. ఈరన్న ఇంటర్ విద్యకు రూ.లక్షన్నర చేయూతనందించారు. ఈ ప్రోత్సాహంతో మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి 440 మార్కులకు గాను 425 మార్కులు సాధించాడు. ఈరన్న చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేశారు. ఈరన్న‌ మాట్లాడుతూ రవి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి చదువుకుని డాక్టర్ సీటు సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు. శశికాంత్ వల్లేపల్లికి రవి ధన్యవాదాలు తెలిపారు. ముప్పా రాజశేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags-Ravi potluri helps BiPC student in kappatralla

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles