మలేషియాలో వైభవంగా బతుకమ్మ సంబురాలు

Featured Image

ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్స్–మలేసియా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిచారు. కౌలాలంపూర్ లోని కృష్ణ మందిరంలోని బృందావన్ హాల్, బ్రిక్ ఫీల్డ్స్ లో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధులుగా మెంబెర్ అఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పెరాక్ స్టేట్ వాసంతి సిన్ని సామి, ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ సుభాషిణి నారాయణన్, తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్, కోశాధికారి నాగరాజు, మలేషియా ఆంధ్రా అసోసియేషన్ విమెన్ ప్రెసిడెంట్ శారదా, భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ సత్య, విమెన్ ప్రెసిడెంట్ గీత హజారే, భరత్ రాష్ట్ర సమితి మలేషియా వైస్ ప్రెసిడెంట్ అరుణ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావులు పాల్గొన్నారు.

మలేషియాలో భారతీయ వారసత్వాన్ని కాపాడేందుకు ఎఫ్ఎన్సీఏ చేస్తున్న కృషిని వాసంతి ప్రశంసించారు. ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ సుభాషిణి నారాయణన్ మహిళలతో ఆడి పాడి సందడి చేశారు. అందంగా అలంకరించిన బతుకమ్మకు బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడింది. పాల్గొన్నవారికి వెండి నాణేలు అందజేశారు. ఎఫ్ఎన్సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రవాస భారతీయుల మధ్య ఐక్యతను పెంపొదించేందుకు సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. నవీన్ కుమార్, జగన్, నజీమ్, స్టాలిన్, జగదీశ్, సందీప్, అరుణ్, రవికుమార్ తదితరులు సహకరించారు.

సంస్థ సహాధ్యక్షుడు కృష్ణ ముత్తినేని, ఉపాధ్యక్షుడు రవివర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక, సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజశేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షుడు క్రాంతికుమార్ గాజుల, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయికృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి, రజినిలు పాల్గొన్నారు.

Tags-FNCA Malaysia 2025 Batukamma Conducted Successfully

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles