తానా ఆధ్వర్యంలో...తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తుల సంస్మరణ

Featured Image

తానా సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డా. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు అంతర్జాల సమావేశం విజయవంతంగా జరిగింది. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులను ఆహ్వానించి సభను ప్రారంభించారు. వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – తెలుగునేలపై ప్రభవించిన ప్రతిభావంతులు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనేగాక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించినప్పుడు ప్రాంతాలకతీతంగా ప్రతి తెలుగుగుండె గర్వంతో ఉప్పొంగుతుంది. తెలంగాణ ప్రాంతంలో జన్మించి సాహిత్యరంగంలో విశేష కృషిచేసిన వారిలో కొంతమందిని తెలంగాణా రాష్ట్ర తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ముఖ్యఅతిధిగా హాజరైన పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ వీసీ ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య కాళోజీ బహుభాషా పండితులని, సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై ముఖ్యంగా నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్షర పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన ప్రజాకవి అని ప్రస్తుతించారు.

డా. జుర్రు చెన్నయ్య ప్రముఖ పాత్రికేయుడు డా. దేవులపల్లి రామానుజరావు గురించి

డా. కెడిడి మృణాళిని సాహితీవేత్త ఆచార్య డా. బిరుదురాజు రామరాజు గురించి

రంగరాజు పద్మ సాహితీవేత్తలు ఒద్దిరాజు సోదరులు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావుల గురించి

డా. వి. జయప్రకాష్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్యుల గురించి

డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు సాహితీ పరిశోధకుడు డా. కపిలవాయి లింగమూర్తి గురించి

డా. బ్రాహ్మణపల్లి జయరాములు అభినవ పోతన డా. వానమామలై వరదాచార్యుల గురించి

శ్రీధర్ రావు దేశ్ పాండే హిందుస్తానీ సంగీత పండితుడు డా. సామల సదాశివ గురించి

డా. కొండపల్లి నీహారిణి చిత్రకారుడు డా. కొండపల్లి శేషగిరిరావు గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Tags-TANA Prapancha Sahitya Vedika Sep 2025 Meet About Telangana Literary Stalwarts

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles