సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో చండీ హోమం

Featured Image

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2025 తేదీన దేవి కృపను స్మరించుకుంటూ చండీ హోమ మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 350 మంది భక్తులు పాల్గొని, ఈ పవిత్ర హోమం ద్వారా చండీదేవి అమ్మ వారి ఆశీర్వాదాలను పొందారు. దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సభ 30 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తోంది.

కార్యక్రమం గణపతి పూజ మరియు కలశ స్థాపనంతో ఆరంభమైంది. అనంతరం గణపతి హోమం మరియు నవగ్రహ హోమం నిర్వహించబడింది. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మాహాత్మ్యం పరాయణ హోమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించి, పూర్ణాహుతి, దీపారాధన మరియు ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది. దేవీ మాహాత్మ్యం ఘోషతో ఆ ప్రాంగణం అంతా పవిత్రతతో నిండిపోయి, భక్తులలో ఆధ్యాత్మిక భావన మేల్కొంది.

సభ తరపున వాలంటీర్లకు సత్కారం నిర్వహించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక మరియు విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు. చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాదం పంపిణీ చేయబడింది. SDBBS అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణసుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్ మరియు కార్తిక్ లకు అలాగే కార్య‌క్ర‌మానికి తోడ్పడిన అందరి వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Tags-Singapore Daskhina Bharata Brahmana Sabha 2025 Chandi Homam

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles