యూకె...రెడింగ్‌లో బతుకమ్మ జాతర

Featured Image

యునైటెడ్ కింగ్‌డమ్‌ రెడింగ్‌లోని రెడింగ్ జాతర టీమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెయ్యి మందికి పైగా ప్రవాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలు, యువతులు, పిల్లలు ఉత్సాహంగా డాండియా ఆడారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దుర్గాపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు భరతనాట్యం ప్రదర్శన అలరించింది. తెలుగు వంటకాలతో సాంప్రదాయ విందు ఏర్పాటు చేశారు. బతుకమ్మల నిమజ్జనంతో కార్యక్రమం ముగిసింది.

గత 11 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విశ్వేశ్వర్ మంథని, రంజిత్ నడిపల్లి, ప్రసాద్ అవధానుల, రమేశ్ జంగిలి, రఘు, చందు, రామ్‌రెడ్డి, రామ్‌ప్రసాద్, నాగార్జున తదితరులు సమన్వయపరిచారు. తెలంగాణ సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

Tags-Reading UK Batukamma 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles