చికాగోలో వైభవంగా ఆటా బతుకమ్మ

Featured Image

అమెరికా తెలుగు సంఘం(ATA) ఆధ్వర్యంలో శనివారం నాడు ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మిడ్‌వెస్ట్‌లో అతిపెద్ద బతుకమ్మ వేడుక ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పూజతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు, బతుకమ్మ ఆటలు, కోలాటాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు, ప్రవాసులు బతుకమ్మ సంబరాలకు వన్నె తెచ్చారు.

ఈ వేడుకకు సమన్వయకర్తలుగా శిరీష వీరపనేని, సుచిత్ర రెడ్డి, సైన నర్వాడే, సారికా రెడ్డిశెట్టిలు వ్యవహరించారు. ఆటా కార్యదర్శి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, ట్రస్టీలు వెన్ రెడ్డి, ఆర్వీ రెడ్డి, ప్రాంతీయ కోఆర్డినేటర్లు రాజ్ అడ్డగట్ల, పురుషోత్తం రెడ్డిలు సహకరించారు. పలు స్టాండింగ్ కమిటీ సభ్యులు, వాలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. హనుమంత్ రెడ్డి, కేకే రెడ్డి, సత్య కందిమల్ల, కరుణాకర్ మాధవరం తదితరులు పాల్గొన్నారు. గాయని శాలిని తన సంగీత ప్రదర్శనతో అలరించారు. ఆటా స్థానిక కార్యవర్గ సభ్యుల వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles