సింగపూర్‌లో బతుకమ్మ సంబరాల కోలాహలం

Featured Image

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్-TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక సంబవాంగ్ పార్క్లో శనివారం నాడు వైభవంగా కోలాహలంగా నిర్వహించారు. బతుకమ్మ సాంప్రదాయ ఆటపాటలతో హుషారుగా గడిపారు.

ISKM అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిరం సింగపూర్, వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ(పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సొసైటీ అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము సింగపూర్ లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ పట్ల హర్షం తెలిపారు. చాలా అందంగా అలంకరించి వివిధ రూపాలలో 100 పైగా బతుకమ్మలను ప్రవాస మహిళలు వేడుకలకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 11 బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. వేడుకలకు వచ్చే వారికి ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పించారు. సాంప్రదాయ తెలుగు భోజనం అలరించింది.

కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సొసైటీ ఉపాధ్యక్షుడు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివప్రసాద్ ఆవుల, పెరుకు శివరామ్ ప్రసాద్, రవిచైతన్య మైసా, భాస్కరరావు పులిగిళ్ల, విజయమోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ, మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బొందుగుల ఉమా రాణి ,నంగునూరు సౌజన్య, బసిక అనితరెడ్డి, హేమలత, దీప నల్ల, జూలూరు పద్మజ, కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, ఎర్రమరెడ్డి దీప్తి, హరిత విజాపుర్, సౌజన్య మాదారపు, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధారాణి పెసరు, రావుల మేఘన, చల్ల లత తదితరులు పాల్గొన్నారు. వేడుకల నిర్వహణకు సహకరించిన దాతలకు కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Tags-TCSS Singapore Batukamma 2025 Grand Success

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles