దాశరథి సాహిత్యంపై టాంటెక్స్ సదస్సు

Featured Image

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ నెలనెల తెలుగువెన్నెల తెలుగు సాహిత్య వేదిక 218వ సాహిత్య సదస్సు ఆదివారం నాడు డాలస్లో ఘనంగా నిర్వహించారు. హిమగిరి తనయే.. ప్రార్థన గీతాన్ని సమన్విత మాడా ఆలపించడంతో సదస్సును ప్రారంభించారు. దయాకర్ మాడా స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ సంవత్సరం శతజయంతి జరుపుకోనున్న ప్రముఖ కవి ఆలూరి బైరాగి నాక్కొంచెం నమ్మకమివ్వు కవిత చదివి అంజలి ఘటించారు. డాక్టర్ యు. నరసింహారెడ్డి మన తెలుగు సిరిసంపదలు పేరిట పద ప్రహేళికల కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా డాక్టర్ వోలేటి పార్వతీశం పాల్గొన్నారు. 'మహాకవి దాశరథి జీవితము-సాహిత్యము' గురించి అనర్గళంగా మాట్లాడారు. వారి సాహిత్యాన్ని విశ్లేషించారు. జీవితాంతం దేశం కోసం అణగారిన ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించారు. ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదని పేర్కొన్నారు. రేడియోలో దాశరధితో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. లెనిన్ వేముల దాశరథి రాసిన సుప్రసిద్ధ మహాంధ్రోదయ గేయాన్ని అద్భుతంగా పాడి వినిపించారు. గని మాట-పాట అంశంపై ప్రజానాట్యమండలి గాయకుడు గని తన సుదీర్ఘ కళా ప్రస్థానంలో పాడిన అత్యుత్తమ గేయాలను పాడి వినపించారు. వేములపల్లి శ్రీకృష్ణ రాసిన అజరామర తెలుగు జాతీయగేయం చెయ్యెత్తి జైకొట్టి తెలుగోడా గేయాన్ని ఆలపించి ఉత్తేజపరచారు.

టాంటెక్స్ అధ్యక్షుడు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున సమన్వయకర్త దయాకర్ మాడ పార్వతీశం, గనిలను జ్ఞాపికతో సత్కరించారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చిన్నసత్యం వీర్నపు, ప్రొఫెసర్ రామ్ దంతు, ప్రొఫెసర్ పుదూరు జగదీశ్వరన్, చంద్రహాస్ మద్దుకూరి, మాడిశెట్టి గోపాల్, లెనిన్ బంద, గౌతమీ మాడ, లక్ష్మి యద్దనపూడి, విజయ మామునూరి, సరోజ కొమరవోలు, గోవర్ధనరావు నిడిగంటి తదితరులు పాల్గొన్నారు.

Tags-TANTEX 218th Nela Nela Telugu Vennela Literary Meet

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles