లండన్‌లో వైభవంగా తాల్ క్రిస్మస్ వేడుకలు

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(TAL) ఆధ్వర్యంలో శనివారం నాడు ఈస్ట్‌ హామ్‌లోని పిల్‌గ్రిమ్స్ వే చర్చిలో 17వ వార్షిక క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. 250 మంది పాల్గొన్నారు. సమైక్యతకు అద్దం పట్టే వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

చిన్నారులు క్రిస్మస్ కారోల్స్, ఉత్సాహభరిత నృత్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సలోమీ సుఖేష్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. దేవుని ప్రేమను పంచుకోవడం, క్రిస్మస్ పండుగ నిజమైన అర్థాన్ని స్వీకరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు.

ముఖ్య అతిథిగా ఈస్ట్ హామ్ ఎంపీ సర్ స్టీఫెన్ టిమ్స్ పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడుతూ..స్థానిక చర్చిలు చేపడుతున్న సమాజసేవ కార్యక్రమాలను అభినందించారు. తాల్ సంస్థను ప్రశంసించారు.

సంస్థ చైర్మన్ రవి సబ్బా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ట్రస్టీలు అనిల్ అనంతుల, రవి కుమార్ రెడ్డి మోచర్ల, శ్రీదేవి అలెద్దుల, సత్య పెద్దిరెడ్డి, కిరణ్ కప్పెట, అశోక్ మాడిశెట్టి, వెంకట్ నీలా, నిర్వాహక బృందం రవి మోచర్ల, జెమిమా దారా, రత్నాకర్ దారా, పద్మ కుందన్, కరుణాకర్, సభ్యులు శ్రీధర్ వనం, బాలాజీ కాల్లూర్, గౌతమ్ అడ్డు తదితరులు వేడుకల విజయవంతానికి కృషిచేశారు.

మరింత సమాచారం కొరకు - www.taluk.org చూడవచ్చు.

Tags-TAL 2025 Christmas Celebrations In London

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles