అమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సు

🕑 Published: September 16, 2026 at 03:48 PM CST

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో "అమెరికా కలలు-వాస్తవాలు" శీర్షికతో ఆన్‌లైన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమోషనల్ ఇంటిలెజెన్స్ కోచ్ భారతీ నాదెండ్ల పాల్గొని విలువైన సూచనలు అందించారు. అమెరికాలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరి మనసులో ఎన్నో ఉన్నతమైన కలలు ఉంటాయని, అయితే అక్కడి పరిస్థితులు, జీవన శైలి, వృత్తిపరమైన ఒత్తిళ్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ఆమె విశ్లేషించారు. పైకి కనిపించే మెరిసే జీవితం వెనుక ఎంతో కఠినమైన శ్రమ, సవాళ్లు ఉంటాయని యువత గ్రహించాలని సూచించారు. చదువు కోసం, ఉద్యోగాల కోసం అమెరికాకు వస్తున్న విద్యార్థులు ఆర్థిక సర్దుబాట్లు, ఒంటరితనం, కొత్త సంస్కృతికి అలవాటు పడటంలో ఎదురయ్యే ఇబ్బందులను భారతీ ప్రస్తావించారు. సరైన అవగాహన లేకపోతే చిన్న సమస్యలు కూడా మానసిక ఆందోళనకు దారితీస్తాయని, ముందస్తు మానసిక సిద్ధత ఎంతో అవసరమని చెప్పారు. అమెరికాలో వివాహాలు, సంబంధాల విషయంలో యువత వారి కుటుంబాల అంచనాలు వాస్తవ రూపం దాల్చేటప్పుడు కొన్నిసార్లు పొరపడే అవకాశం ఉందని హెచ్చరించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా అమెరికా జీవన విధానాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని భారతీ సూచించారు.

నాట్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి చిలుకూరి సమన్వయపరిచారు. అమెరికాలో గృహహింస, కుటుంబ వివాదాల బాధితులకు నాట్స్ అందిస్తున్న తోడ్పాటును వివరించారు. అమెరికా జీవితం గురించి ఎన్నో ఆశలతో వచ్చే మహిళలు వాస్తవంగా ఎదుర్కొంటున్న పరిస్థితులను వారి భద్రత కోసం నాట్స్ తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. నాట్స్ హెల్ప్‌లైన్ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. మురళి, రాజేష్, కిషోర్, అశ్వదీప్తి తదితరులు సహకరించారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడలు నిర్వాహకులను అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
ఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలుSingapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making EventAustralia: సిడ్నీలో "నిజం గెలిచింది"మెలిస్సాలో "సంకీర్తన" తరగతులువీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీనెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్YSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతిబాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ఖత్తర్‌లో సన్మానంపేద విద్యార్థులకు బ్యాగులు అందజేసిన తానా ఒహాయో వ్యాలీకాంగ్రెస్ 1000రోజుల పాలనపై ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నిరసనచికాగోలో ఉత్సాహంగా సాగిన నాట్స్ క్రికెట్ పోటీబాధ్యతలు చేపట్టిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన కార్యవర్గంవర్జీనియాలో గురుపూజోత్సవంఅట్లాంటా పర్యటనలో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుతెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాలి - సింగపూర్‌లో జయజపాన్‌లో జన్మాష్టమి వేడుకలుడల్లాస్‌లో సందడిగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
Previous Article Next Article