🕑 Published: September 16, 2026 at 03:59 PM CST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో 2026 సమ్మర్ చెస్ టోర్నమెంట్ ఉల్లాసంగా సాగింది. కు భారీ స్పందన వచ్చింది. శనివారం నాడు ఫిలడెల్ఫియాలోని ఎక్స్టన్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో 100మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. యుఎస్ చెస్ ఫెడరేషన్ రేటెడ్ ఆటగాళ్లు ఇందులో పాల్గొన్నారు. ట్రై-బ్రిడ్జెస్ చెస్ క్లబ్ టోర్నమెంట్ డైరెక్టర్ జాషువా ఆండర్సన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నాయుడమ్మ యలవర్తి, ప్రసాద్ కస్తూరి, సురేష్ యలమంచి, కృష్ణ నందమూరి, శ్రీధర్ సాదినేని, రంజిత్ మామిడి, చలం పావులూరి, వ్యోమ్ కొత్తపల్లి, ధీరజ్ యలమంచి, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావ సహకరించారు.
* రేటెడ్ ఓపెన్ విజేతలు
ఫస్ట్ ప్లేస్- సాయి రేయాన్ష్ నగిశెట్టి
సెకండ్ ప్లేస్- హైంధవ్ మురుగేష్
థర్డ్ ప్లేస్-- యువిన్ శ్రీనివాసన్
* అండర్ 900 రేటెడ్ విజేతలు
ఫస్ట్ ప్లేస్-- ప్రణవ్ కంతేటి
సెకండ్ ప్లేస్- కార్తికేయ కుర్చర్లపాటి
థర్డ్ ప్లేస్-- రిధిక అరవిందకుమార్
* అండర్ 500 రేటెడ్ విజేతలు
ఫస్ట్ ప్లేస్ --- బోధి రాయ్
సెకండ్ ప్లేస్--విదిత్ కువేల్కర్
థర్డ్ ప్లేస్--- నంద వి మేలం
* కె8 అన్‌రేటెడ్ విజేతలు
ఫస్ట్ ప్లేస్ --కుశాల్ తడువాయి
సెకండ్ ప్లేస్--శ్రీయాన్ వజ్రాల
థర్డ్ ప్లేస్-- అడ్రియన్ బెన్సన్
* 9-12(పెద్దలతో కలిపి) అన్‌రేటెడ్ విజేతలు
ఫస్ట్ ప్లేస్--- సునీల్ కొత్త
సెకండ్ ప్లేస్- పునీత్ మద్ది
థర్డ్ ప్లేస్-- జీవన్ మర్రిబోయిన




