🕑 Published: September 18, 2026 at 04:08 PM CST
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(TANTEX), టెక్సాస్ ఇండో-అమెరికన్ ఫిజిషియన్స్ సొసైటీ(TIPS) భాగస్వామ్యంతో ఫ్రిస్కోలోని రిజాయిస్ లూతెరన్ చర్చిలో గత శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇంటర్నల్ మెడిసిన్/ఫ్యామిలీ ప్రాక్టీస్, కార్డియాలజీ, న్యూట్రిషన్, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, రుమటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, స్లీప్ మెడిసిన్ తదితర వైద్య విభాగాలకు చెందిన నిపుణులు సేవలందించారు.
ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా పాల్గొని కమ్యూనిటీ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్య నిపుణుల సలహాలను అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యం అన్నారు.


