🕑 Published: September 05, 2026 at 04:55 PM CST
ఏపీ ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు డల్లాస్‌లో సందడిగా జరిగాయి. డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ది కాలనీలోని Twisted Bar & Grillలో నిర్వహించిన ఈ వేడుకలకు డీఎఫ్‌డబ్ల్యూ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులంతా వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్, డీజే నైట్, సంగీతం, డ్యాన్స్‌తో అభిమానులు సందడి చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని, మరింత కాలం ప్రజాసేవలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. 300మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





