🕑 Published: October 18, 2026 at 03:44 PM CST
ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐ.పి.ఎఫ్) తెలంగాణ చాప్టర్ దుబాయిలో శనివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు వేడుకగా జరిగాయి. మహిళలు అందంగా అలంకరించిన బతుకమ్మల వద్ద నాట్యం చేశారు. స్థానిక ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. దుబాయి, ఇతర గల్ఫ్ ప్రవాసీయుల ఇబ్బందుల గురించి తనకు అవగాహన ఉందని తన వ్యక్తిగత ట్రస్ట్ కూడా బాధితులకు తోడ్పడేందుకు నిరంతరం పని చేస్తోందని అర్వింద్ అన్నారు. ఎంపీ అర్వింద్తో పాటు బీజేపీ నాయుకుడు, వరంగల్ నగరానికి చెందిన మాజీ మంత్రి దివంగత దాస్యం ప్రణయ్ భాస్కర్ కుమార్ కుమారుడు అభినవ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.


