నాట్స్ సంబరాలకు టాంపా చేరుకున్న వెంకటేష్

Featured Image

నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం నుండి మూడు రోజుల పాటు టాంపాలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రముఖ సినీనటుడు విక్టరీ వెంకటేష్ టాంపా చేరుకున్నారు. నిన్న సాయంత్రం నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఆయన క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వెంకీతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా టాంపాలో సందడి చేశారు. శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో నాట్స్ సంబరాలు ప్రారంభమవుతాయి. సినీనటుడు బాలకృష్ణ గురువారం నాడు మియామీ చేరుకుంటారని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు తెలిపారు. వివరాలకు, టికెట్లకు www.sambaralu.org చూడవచ్చు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Actor venkatesh and director gopichand malineni at tampa for nats

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles